19-08-2025 05:11:05 PM
ఇసుక సరఫరాలో నయా దందాని అరికట్టాలి
డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): ఇసుక సరఫరాలో నయా దందాని అరికట్టాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన డివైఎఫ్ఐ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇసుక సరఫరా కోసం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఎటువంటి సమాచారం లేకుండా క్యాన్సల్ చేస్తు ఆఫ్లైన్లో ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారని, సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఆన్లైన్లో బుక్ చేసుకుంటే క్యాన్సల్ అయి రావడం లేదన్నారు.
జిల్లాలో మైనింగ్ శాఖ అధికారులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇసుక సరఫరా చేసే విధంగా చూడాలన్నారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న పట్టించుకోని మైనింగ్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.