calender_icon.png 19 August, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి జిల్లా పర్యటన వాయిదా

19-08-2025 05:32:00 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఈనెల 21వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన వాయిదా పడినట్లు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయం మంగళవారం ప్రకటించింది.  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి  ఉపరాష్ట్రపతి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అత్యవసరంగా ఢిల్లీ వెళ్తున్న కారణంగా భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలోని ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం, బహిరంగ సభ కార్యక్రమాలు వాయిదా వేయడం జరిగింది. ప్రకటనలో వెల్లడించారు. తదుపరి ముఖ్యమంత్రి జిల్లా పర్యటన తేదీలు త్వరలో తెలియచేయడం జరుగుతుందన్నారు.