calender_icon.png 19 August, 2025 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జన వికాస సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

19-08-2025 05:07:24 PM

మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని బొత్తల తండాలో జన వికాస సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో పల్లె దవాఖాన డాక్టర్ స్వామి పాల్గొని సుమారు 150 మంది రోగులకు పరీక్షలు చేశారు. అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నేడు మనం తీసుకునే ఆహారం, వాతావరణంలో వస్తున్న మార్పులు, ఇతర కాలుష్యాల వలన ప్రతి ఒక్కరు అనారోగ్యాల బారిన పడుతున్నారని, ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్యం పట్ల నిర్లక్షం వద్దని, ప్రతిఒక్కరూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకొని ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, పగటిపూట దోమలు కుట్టడం ద్వారా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గునియా, ఫైలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తమ పరిసర ప్రాంతాలల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, నీరు నిల్వ ఉన్నట్లయితే వాటిల్లో దోమలు అధిక మొత్తంలో గుడ్లు పెట్టి వాటి సంతాన ఉత్పత్తిని పెంచుకుని వాధ్యులకు కారకాలుగా మారే ప్రమాదం ఉందని అలా జరకుండా ఎప్పటికప్పుడు తమ ప్రాంతాలలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.