19-08-2025 05:25:46 PM
ఎంఈఓ బోనగిరి శ్రీనివాస్
జైపూర్,(విజయక్రాంతి): విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యే విధంగా ఈ మేళాలు దోహదపడుతాయని మండల విద్యాశాఖ అధికారి బోనగిరి శ్రీనివాస్ అన్నారు. మంగళ వారం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో బోధన అభ్యాసన సామాగ్రి మేళాను జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి సత్యనారాయణమూర్తి, చౌదరి, తహసిల్దార్ వనజా రెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, ఎస్ఐ శ్రీధర్ కలిసి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
బోధన అభ్యాసన సామాగ్రి ఉపాధ్యాయులకు దిక్సూచి వంటిదని, విద్యార్థులు నిత్యజీవితంలో కూడా వినియోగించుకోగలిగేలా ఉపాధ్యాయులు సృజనాత్మకంగా రూపొందించారని అన్నారు. తెలుగు, గణితం, ఇంగ్లీష్, పర్యావరణ అధ్యయనాల్లో ఉపాధ్యాయులు రూపొందించిన చార్టులు, బోధన సాధనాలను పరిశీలించారు. న్యాయ నిర్ణేతలు పవన్, మొగిలి సత్తయ్య, పద్మజ, రత్నాకర్, హేమలత, రవీందర్, రమేష్ బాబు, సత్తిరెడ్డి తదితరులు వ్యవహరించగా విజేత పాఠశాలలకు అభినందన సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.