31-07-2025 12:00:00 AM
- బీసీలకు అన్యాయం చేయనున్న కాంగ్రెస్ ప్రభుత్వం
- రాజకీయ మతపరమైన లబ్ది కోసమే బీసీ రిజర్వేషన్
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు రాంచందర్‌రావు
ఇల్లందు టౌన్, జులై 30,(విజయక్రాంతి):తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు. బుధవారం బిజెపి నాయకుడు సేనాపతి మురళీకృష్ణ స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో బిఆర్‌ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ వ్యవహరిస్తుందని విమర్శించారు. బీసీలకు బిజెపి పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇల్లందు నియోజకవర్గానికి నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంతో పాటు ఇల్లందు ఎమ్మెల్యే, ఇల్లందు మున్సిపాలిటీలో బిజెపికి ఒక అవకాశం ఇస్తే, అభివృద్ధి చేసి చూపిస్తామని పేర్కొన్నారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఇల్లందులో పరిశ్రమలు లేక నిరుద్యోగులకు ఉపాధి దొరికే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుత రాష్ట్ర మంత్రి తుమ్మల మొండి చేయి వల్లనే సీతారామ ప్రాజెక్టును దారి మళ్ళించడం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ 42 శాతంరిజర్వేషన్ చేస్తామరటం కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శించారు.
బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లలో ముస్లింలకు 10 శాతం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్ల బీసీలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ సీతారాం నాయక్, నాయకులు రామచందర్ నాయక్, విమల్ కుమార్ జైన్, సుచిత్ర పాసి, బాలగాని గోపికృష్ణ గౌడ్, మావునూరి మాధవ్, మిరియాల వెంకటేశ్వర్లు, సేనాపతి మురళీకృష్ణ, భట్టు రమేష్, దోమల మహేష్, రేవెల్ల నాగరాజు శివకుమార్ ఖండేల్ వాల్, పుణ్యా నాయక్, రజత్ కోరి, నరసింహారెడ్డి, పవన్ తదితరులు పాల్గొన్నారు.