10-08-2025 12:36:34 AM
-గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): లవ్ జిహాద్ పేరిట కొందరు హిందూ మహిళలను టార్గెట్ చేస్తున్నారని అందుకే తన సోదరీమణులు అప్రమత్తంగా ఉండాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇన్‌స్టాగ్రాం వేదికగా శనివారం ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు.
రక్షాబంధన్ అనేది అన్నాచెల్లెళ్ల మ ధ్య ఉన్న అనుబంధానికి ప్రతీక.. అన్నదమ్ము లు రక్షణగా నిలవాలని సోదరీమణులు మా ట తీసుకుంటారు. అలాగే నా హిందూ సోదరీమణులు కూడా నాకో మాట ఇవ్వాలి. దేశంలో నేడు లవ్ జిహాద్ పేరిట పెద్దఎత్తున కుట్రలు జరుగుతున్నాయి. హిందూ యువతులను లక్ష్యంగా చేసుకుని లవ్ జిహాద్ వైపు మళ్లీస్తున్నారు.
ఆ తర్వాత పాశవికంగా చంపేస్తున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లవ్ జిహాద్ భూతానికి దూరంగా ఉండాలి అంటూ హిందూ యువతులకు విజ్ఞప్తి చేశా రు. లవ్ జిహాద్‌లో భాగంగా హిందూ యు వతులను పెళ్లి చేసుకుని ముక్కలు ముక్కలుగా నరికి అతి కిరాతకంగా ఫ్రిజ్‌లో ప్యాక్ చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
చాలా మంది అమాయక హిందూ మహిళలు లవ్ జిహాద్‌లో చిక్కుకుంటున్నారని, దేశంలోకి ఇందు కోసం బయటి నుంచి ఫండింగ్ కూడా అందుతోందన్నారు. రాఖీ పండుగ సందర్భంగా తామంతా హిందువుగానే జీవిస్తా మనే మాట ఇవ్వాలని ఆయన కోరారు. లవ్ జిహాద్ విషయంలో మహిళలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరారు. దీనిపై అనేక హిందూ సంఘాలు పోరాడుతున్నాయని, ఈ పోరాటానికి హిందూ మహిళలు సహకరిస్తామని. రక్షాబంధన్ సందర్భంగా తనకు మాట ఇవ్వాలని రాజాసింగ్ కోరారు.