calender_icon.png 10 August, 2025 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ యూనివర్సిటీలో.. అడవిబిడ్డలకు ఉచిత దూరవిద్య

10-08-2025 12:40:14 AM

- ఆదివాసీ ఉచిత విద్యా ప్రణాళిక అమలు

- వీసీ ఘంటా చక్రపాణి  

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): ఈ విద్యా సంవత్సరం నుంచి ఆదివాసీ అడ వి బిడ్డలకు ఉచిత ఉన్నతవిద్యను అందించనున్నట్టు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఘం టా చక్రపాణి వెల్లడించారు. తమ విశ్వవిద్యాలయం ద్వారా గడిచిన నాలుగు దశాబ్దాల్లో చదువుకు దూరమైన లక్షలాది మందికి  ఉ న్నత విద్య అవకాశాలు చేరువ చేశామన్నా రు. లక్షలాది మంది ఉన్నతవిద్యను అభ్యసించిన వారిలో ఎవరున్నారు అని కాకుండా.. ఏయే వర్గాల వారు లేరో విశ్వవిద్యాలయం పరిశోధించిందన్నారు. 

కొన్నివర్గాలు, తెగలు ఇంకా చదువుకు దూరంగానే ఉన్నారనేది వెల్లడయిందని పేర్కొన్నారు. అందులో ము ఖ్యంగా ఆదివాసీ తెగలు ఉన్నత విద్యలో అత్యంత వెనుకబడి ఉన్నారని విశ్వవిద్యాల యం గుర్తించి వారికి ఉన్నత విద్యను అం దించాలని నిర్ణయించిందని తెలిపారు. అం బేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బహుజన బడి అని, 90 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నారిటీ విద్యార్థులు.. అందులో సగం మహిళలు చదువుతున్న విశ్వవిద్యాలయన్నారు.

అయినప్పటికీ తెలంగాణలోని ఆదివాసీ తెగ లు తగినంతగా ఉన్నత చదువుల్లోకి రాలేదని గమనించి వారికోసం ఒక ప్రత్యేక ప్రణాళిక తీసుకొని ముందుకు వచ్చిందని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లోనూ స్టడీ సెంటర్ల ను ఏర్పాటు చేసినప్పటికీ ఆదివాసీలకు చే రువకాలేకపోయామన్నారు. డిగ్రీ కోర్సులకు దేశంలోనే అత్యంత తక్కువ ఫీజు ఏడాదికి రూ.3200 మాత్రమే వసూలు చేస్తున్నామ ని, కానీ అడవి బిడ్డలకు అది కూడా భారమే కాబట్టి వారికి ఫీజు లేకుండా చదువు చెప్పాలని భావించి ఆదివాసీ ఉచిత విద్యా ప్రణాళి క ప్రారంభించినట్టు తెలిపారు.

ఈ క్రమంలో నే రాష్ర్టంలోని గోండు, కోయ, చెంచు తదితర తెగల అడవిబిడ్డలకు అండగా నిలవడం, వారి నివాస ప్రాంతాలకు దగ్గరలో ఎలాంటి బోధన రుసుము లేకుండా కేవలం రూ.500 నామమాత్రపు అడ్మిషన్ ఫీజుతో ఉచితంగా చదువు చెప్పడం, ఉచితంగా పా ఠ్య పుస్తకాలు అందించడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. రాబోయే ఐదేళ్లలో కనీసం వెయ్యి మంది ఆదివాసీ పిల్లలను పట్టభద్రులుగా నిలబెట్టాలన్నది లక్ష్యంగా పెట్టుకున్న ట్టు వివరించారు. ఈ విద్యాసంవత్సరం 2025 నుంచి ఈ కార్యక్రమం అమలులోకి వచ్చిందని.. ఇందులో చేరడానికి ఆగ స్టు 13 చివరి తేదీ అని పేర్కొన్నారు.

నేడు ఎప్‌సెట్ తుది విడత సీట్లు కేటాయింపు 

ఎప్‌సెట్ తుది విడత సీట్లను ఆదివారం విద్యార్థులకు కేటాయించమన్నారు. తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభం కాగా 6వ తేదీన అ భ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ, 7 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందు కు అవకాశం కల్పించారు. కౌన్సెలింగ్ ప్రక్రి య ముగియడంతో నేడు ఇంజనీరింగ్ సీ ట్ల ను విద్యార్థులకు కేటాయించనున్నారు. ఇక ఒకటి రెండు రోజుల్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించనున్నారు.

వర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్లు

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2024  విద్యా సంవత్సరానికి కామర్స్, ఇంగ్లీ ష్, తెలుగు, ఆర్థికశాస్త్రం, చరిత్ర, ప్రజాపరిపాలన, సామాజిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం సబ్జెక్టులలో పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆ హ్వానిస్తున్న ట్టు విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ ఫెసర్ పుష్ప చక్రపాణి శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 

యూజీసీ, సీఎస్‌ఐఆర్, జేఆర్‌ఎఫ్, నెట్, సెట్, ఎస్‌ఎల్‌ఈటీలో అర్హ త సాధించి లేదా ఎంఫిల్ పట్టా పొందిన అ భ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కా వాలని సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ల నమోదుకు ఆగస్టు 30 వరకు, ఆలస్య రు సుంతో సెప్టెంబర్ 4 వరకు చివరి తేదీగా పే ర్కొన్నారు. పరీక్ష హైదరాబాద్‌లో మాత్రమే నిర్వహించనున్నట్టు వెల్లడించారు. త్వరలోనే  పరీక్ష తేదీని  వెబ్‌సైట్‌లో ప్రకటిస్తామన్నారు.