14-05-2025 01:14:30 AM
- ఆదమరిస్తే తీరని నష్టమే
- మార్కెట్లో నకిలీ విత్తనాలు
భద్రాద్రి కొత్తగూడెం, మే 13 (విజయక్రాంతి): ఈ ఏడాది వానకాలం ముందుగా నే వస్తుందనడంతో రైతులు సీజన్కు ముం దుగానే దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అకాల వర్షాలు కు రుస్తుండటంతో నేల పదును కావడంతో దు క్కులు దున్నేస్తున్నారు.
ఈ నెల 27 నుంచి నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ మంచి శుభవార్త రా వడంతో అన్నదాతలు సన్నద్ధమవుతున్నా రు. రాష్ట్రంలోకి జూన్ మొదటి వారంలో రు తుపవనాలు ప్రవేశించనున్నట్లు తెలియడం తో రైతులు విత్తనాలు కొనడానికి మార్కెట్లకు పరిగెడుతున్నారు.
విత్తనాలు కొనేముం దు రైతులు తగు జాగ్రత్తలు తీసుకుంటే నకి లీ విత్తనాలకు కళ్లెం వేయవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఏమాత్రం ఏ మరపాటుగా ఉన్నా నకిలీ విత్తనాల కారణంగా పంట దిగుబడి, పంట కాలం వృథా అయ్యే ప్రమాదంతోపాటు ఆర్థికంగా అప్పు ల పాలు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
విత్తన ప్యాకెట్ల పై క్యూఆర్ కోడ్
కమిషన్లకు కక్కుర్తి పడుతూ దళారులు పల్లెల్లో రైతులకు నకిలీ విత్తనాలు అంటగడతారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. విత్తనా లు కొన్న రైతులు కచ్చితంగా రశీదు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం అలవాటు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచి స్తున్నారు.
డీలర్ల వద్ద విత్తనాలు కొన్నా తప్పకుండా రశీదులు తీసుకోవాలని కోరుతు న్నారు. గత ఏడాది జిల్లాలో కొందరు రైతు లు సాగు చేస్తున్న పత్తి ఏపుగా ఎదిగినప్పటికీ కాయ కాయలేదు. దీంతో ఎకరానికి రూ. 1.50 లక్షల వరకు రైతు నష్టపోయాడు. కొ నుగోలు సమయంలో రసీదు పొందకపోవడంతో నష్టపరిహారం పొందలేకపోయా రు. రైతులు మెలకువలు పాటించే విత్తన కొనుగోలు సమయములో అప్రమత్తంగా ఉండా ల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రైతులు తెలుసుకోవాల్సిన అంశాలు
- లైసెన్సు ఉన్న అధీకృత దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలి.
- విత్తన ప్యాకెట్లపై లాట్ నంబర్, ప్యాకింగ్ తేదీ, లేబుల్ తదితరాలను పరిశీలిస్తూ ఉండాలి.
- కొనుగోలు చేసిన విత్తనాలకు రశీదు తప్పనిసరిగా తీసుకోవాలి.
- విత్తన ప్యాకెట్లపై ఉన్న క్యూఆర్ కోడ్ను మొబైల్తో స్కాన్ చేస్తే విత్తనాలకు సంబంధించిన పూర్తి వివరాలు లభిస్తాయి.
- నాటే కంటే ముందే కొన్ని విత్తనాలు తీసుకొని మొలక శాతం పరీక్షించుకోవాలి.
- విత్తన సంచులు, రశీదులను తప్పనిసరిగా భద్రపరుచుకోవాలి.
- తెలిసిన షాపులో విత్తనాలు కొంటె ఇంకా మంచిది.