14-05-2025 01:11:23 AM
- ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఇల్లందు మే 13 (విజయక్రాంతి): ఇందిరమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం నిరుద్యోగుల పాలిటి వరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం భద్రాద్రి కొ త్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం పరిధిలోనిటేకులపల్లి మండలంలో ఆయన ప ర్యటించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు.
మండల పరిధి లోని ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు లో రూ 2. 46 కోట్లతో 33 /11 కెవి విద్యుత్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈనెల 15 నాటికి జిల్లా సెలక్షన్ కమిటీకి, 28 నాటికి శాంక్షన్ ప్రక్రియ పూర్తి చేసి... రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి నియోజకవర్గ వల్ల వారిగా మంజూరు లెటర్ల పంపిణీ చేస్తామన్నారు.
ప్రభుత్వపరంగా 57 వేల ఉద్యోగా లు ఇచ్చామని, జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామన్నారు. ఉద్యోగ అవకాశాలు రానీ నిరుద్యోగుల కోసమే దేశంలో ఎక్కడ లేని విధంగా.. యువత స్వయం శక్తితో ఎదిగేలా రాజీవ్ యువ వికాసం పథకం ప్రవేశపెట్టామన్నారు.సిబిల్ స్కోర్ సామాజిక మాధ్య మాల అవగాహన లేని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
గత నాలుగేళ్లుగా ఎస్సీ ఇతర కార్పొరేషన్ల లోన్లు తీసుకునే వారికి కాకుండా కొత్తవారికి రుణాలు ఇవ్వాలని ప్రభుత్వ ధ్యేయంఇల్లందు, మహబూబాబా ద్ ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల వినతుల మే రకు బయ్యారం ప్రాజెక్టు, తులారం ప్రాజెక్టుపై సర్వే చేసి.. ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చేలా చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను పదేళ్లు పాలించిన బారాస... ఉద్యోగా లు కానీ స్వయం ఉపాధి పొందేలా కానీ ఎ టువంటి పథకాలు అమలు చేయలేదని విమర్శించారు. ఈ సమావేశంలో ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్ , అటవీ అభి వృద్ధి సంస్థ చైర్మన్ పోదాం వీరయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎస్పీ రోహిత్ రాజ్ ఐటీడీఏ పీవో రాహుల్ తదితరులు పాల్గొన్నారు.