30-07-2025 01:30:27 AM
తీవ్రతను బట్టి శస్త్రచికిత్సలు అవసరం
ఏఐఎన్యూ పీడియాట్రిక్ యూరాలజిస్ట్ అశ్విన్ శేఖర్
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 29 (విజయక్రాంతి): మగ పిల్లలు పుట్టినప్పుడు మూత్రనాళం సాధారణంగా అయితే పురుషాంగం చివర తెరుచుకుంటుంది. దాన్నే మూత్రద్వారం అంటారు. కానీ, కొంతమందిలో మాత్రం చివర కాకుండా కిందివైపు తెరుచుకుంటుంది. దీన్నే హైపోస్పేడియాస్ అంటారు. మరికొందరు పిల్లలకు పురుషాంగం కిందకు వంగి ఉంటుంది. దాన్ని కార్డీ అంటారు.
ఈ తరహా సమస్యలు పిల్లలకు ఉంటే వెంటనే తల్లిదండ్రులు అప్రమ త్తం కావాలని, వైద్యులకు చూపించి చిన్నవయసులోనే ఆ లోపాలను సరిచేయించాలని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ) ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ పీడియాట్రిక్, ట్రాన్సిషనల్ యూ రాలజిస్ట్ డాక్టర్ పి అశ్విన్ శేఖర్ చెపుతున్నారు. హైపోస్పేడియాస్ సమస్య ప్రధానం గా జన్యుపరమై కారణాల వల్ల వస్తుందని చెప్పారు.
చిన్న సమస్యే అయితే చిన్నపాటి శస్త్రచికిత్స సరిపోతుం ది. అదే సమస్య ఎక్కువగా ఉంటే సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. ఇలాంటి పిల్లల్లో వృషణాలు కిందకు వచ్చాయో లేదో పరిశీలించాలి. అవి రాకపోతే అప్పుడు కారియో టైపింగ్ పరీక్ష చేయిస్తే అసలు ఏ క్రోమోజోమ్లు ఎన్నెన్ని ఉన్నాయో తెలుస్తుంద న్నారు. హైపోస్పేడియాస్ ఉన్న మగ పిల్లలకు 6 నెలల వయసు మధ్య శస్త్రచికిత్స చేయించాలి.
అయితే అది పురుషాంగం పరిమాణం మీద ఆధారపడుతుంది. ఈ శస్త్రచికిత్సలో మూత్రనాళం ఎక్కడ తెరుచుకోవాలో అక్కడ అది తెరుచుకునేలా సరిచేస్తామని డాక్టర్ చెప్పారు. అలాగే పురుషాంగం వంపు ఉంటే దాన్ని కూడా తిన్నగా చేస్తామన్నారు. ఏఐఎన్యూలో దేశంలోనే ట్రాన్సిషనల్ కేర్ విభాగాన్ని అత్యంత బలోపేతం చేస్తున్నామని, ఒకరకంగా దేశంలో ఇక్కడే ఈ విభాగం ఉన్నదని చెప్పారు. సంక్లిష్టమైన సమస్యలు ఉన్న పిల్లలు ఎప్పుడైనా ఇక్కడకు రావచ్చు అని పేర్కొన్నారు.