30-07-2025 02:39:12 PM
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్,(విజయక్రాంతి): ప్రతి వ్యక్తికి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఇబ్బంది అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. బుధవారం మరిపెడ పట్టణంలోని ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ పాఠశాల, తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. మీ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించాలని, అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని, ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలను పెంచాలని, మాతా శిశు మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేయాలన్నారు.
ఆరోగ్య కేంద్రం పరిధిలోని సబ్ సెంటర్ల వారీగా షెడ్యూల్ ప్రకారం వైద్య సేవలు అందించాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థుల యొక్క అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల చదువు పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని, ఆయా సబ్జెక్టుల్లో సులువుగా విద్యాబోధన చేయాలని సూచించారు. తాసిల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరు, సర్టిఫికెట్ల జారీ విషయంపై ఆరా తీశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు నిర్ణిత వ్యవధిలో అందేలా చూడాలని ఆదేశించారు.