అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
పెద్దలోడి తాడిపల్లి రోడ్ లో ఘటన
సంగారెడ్డి: మునిపల్లి మండలంలోని మక్తక్యాసారం రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సదాశివపేట నుంచి రోజు మాదిరిగానే బుధవారం ఉదయం కూడా మక్త క్యాసారం పెళ్లి విద్యార్థులు, ప్రయాణికులను సదాశివపేటకు వస్తున్న క్రమంలో పెద్దలోడి గ్రామ శివారులో రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి బస్సు అదుపుతప్పింది. దీంతో పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. అందులో ప్రయాణిస్తున్న సుమారు 60 మంది ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ అప్రమత్తతో బస్సు ను కాలువలో నిలపడంతో తమ ఎలాంటి ప్రమాదం జరగలేదని ప్రయాణికులు పేర్కొన్నారు. కాగా బస్సు నడుపుతున్న డ్రైవర్ కు స్వల్పంగా చేతికి గాయమైనట్టు తెలుస్తుంది.






