30-07-2025 02:43:11 PM
సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్
చిట్యాల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గుంటూరుపల్లి గ్రామపంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనులలో 40 లక్షలు కాజేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాతీయ గ్రామీణ ఉపాధి హామీ మండల అధికారి, స్థానిక పంచాయతీ కార్యదర్శి పూర్తి బాధ్యత వహిస్తూ ఎవరైతే అవినీతికి పాలు పడ్డారో వారి నుండి డబ్బులు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.
గత ఐదు సంవత్సరాల కాలంలో ఉపాధి హామీ పనులు ఆ గ్రామంలో ఎక్కడెక్కడ జరిగినవో సమగ్రమైన విచారణ జరిపించాలని అధికారులను కోరారు.జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ చేసి అక్రమానికి పాల్పడిన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని నిరుపేద ప్రజలకు అండగా నిలబడాలన్నారు.లేనిచో ఆ గ్రామ ప్రజలను సమీకరించి ఆందోళనకు సిద్ధం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శిలపాక నరేష్ ,రాజు పాల్గొన్నారు.