30-07-2025 01:56:18 PM
కొండపాక,(విజయక్రాంతి): కొండపాక మండలం దుద్దెడలో 108 వాహనాన్ని తనిఖీ చేసిన జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీస్ ప్రతినిధులు, రాష్ట్ర నాణ్యత విభాగ తనిఖీ అధికారి కిషోర్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ జాన్ షాహిద్, జిల్లా మేనేజర్ శ్రీహరి రామకృష్ణ. బుధవారం 108 అంబులెన్స్ లోని పరికరాలను పనితీరును రికార్డులను, పరిశీలించారు. సిబ్బంది తమ తమ అనుభవాలు పంచుకొని, అధికారులు సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇచ్చి, క్షతగాత్రులకు వివిధ రకాల ఘటనలలో ప్రథమ ప్రాథమిక చికిత్సలు అందించడంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా గోల్డెన్ హవర్ లోనే తప్పకుండా చికిత్సను అందించాలని సిబ్బందికి సూచించారు. సిబ్బంది పనితీరు బాగుందని ప్రశంసించారు.