30-07-2025 01:48:33 PM
అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన
నాగార్జునసాగర్,(విజయక్రాంతి): మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల డిగ్రీ కళాశాల (పురుషులు), నాగార్జునసాగర్ , నల్గొండ జిల్లా డిగ్రీ కోర్సు లలో మొదటి సంవత్సరం ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్స్ ప్రక్రియ ఆగస్టు 6 వరకు పొడిగించారని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి Ch.మాధవి లత తెలిపారు. డిగ్రీ దోస్త్ రిజిస్ట్రేషన్ జూలై(Degree DOST registration) జూలై 31తో దోస్త్ రిజిస్ట్రేషన్ పూర్తి అయిన విద్యార్థులు నేరుగా మా కళాశాల యందు అడ్మిషన్స్ పొందవచ్చు. మా కళాశాల యందు నాణ్యతతో కూడిన విద్య,ఉచిత వసతి, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలతోపాటు, అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన, పోటీ పరీక్షలకు ప్రత్యేక బోధన, ఆటలలో ఆసక్తి కల విద్యార్థులకు ఫిజికల్ డైరెక్టర్ చే ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఇతర వివరములకు 9640811664,9642046006,9492540363,817665589 నంబర్స్ ని సంప్రదించగలరు.