30-12-2025 12:06:33 AM
ఉప్పల్, డిసెంబర్ 29 (విజయక్రాంతి) : కుటుంబ సమస్యలతో బిల్లింగ్‌పై నుండి దూకి ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఉప్పల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం పహాడ్ తాండ బీబీనగర్‌కు చెందిన ధరావత్ ప్రమీల భర్త బాలాజీ నాయక్ ఇద్దరు పిల్లలతో ఉప్పల్ పద్మావతి కాలనీలో నివాసం ఉంటున్నారు. ధరావత్ ప్రమీల 2020 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ ప్రస్తుతం నాచారం పోలీస్ స్టేషన్‌లోని మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తుంది.
సోమవారం ల్లవారుజామున ధరావత్ ప్రమీ ల తరుణ్ నివసిస్తున్న అపార్ట్మెంట్ మూడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికు లు 100 సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపే కుటుంబ సభ్యు లు యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొం దుతున్నట్టు పోలీసులు తెలిపారు. కుటుంబ సమస్యల వల్లనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నా రు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.