17-05-2025 12:04:07 AM
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోటా చలం
సూర్యాపేట, మే 16 (విజయక్రాంతి) : డెంగ్యూ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కోటా చలం అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్బంగా వైద్య ఆరోగ్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది రాబోయే వర్షాకాలం లో ఎప్పటికప్పుడు పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డెంగ్యూ వ్యాధి ఎడిస్ ఈజీప్ట్ అనే దోమ ద్వారా ఒకరినుంచి ఒకరికి వ్యాపిస్తుంది అని తెలిపారు. దోమలు ఇండ్ల పరిసరాలలో ఉన్న గాబులు, తొట్లు, డ్రమ్ములు, ట్యాంకుల లో ఉన్న నీటి నిలువలో మరియు పాత టైర్లు, ఎయిర్ కూలర్ల లో, పూల కుండీలలో నిలువ ఉన్న నీటిలో గుడ్లు పెట్టి వృద్ధి చెందుతాయాన్నారు.
కావున వాటిని ఎప్పటికప్పుడు ఖాళీ చేయాలన్నారు. దోమల ద్వారా డెంగ్యూ, చిగున్ గున్యతో పాటు మలేరియా, బోధకాలు, మెదడు వాపు వ్యాధులు వ్యాపిస్తున్నా యన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా ప్రోగ్రాం అధికారి నాజియా, ప్రోగ్రాం అధికారులు జయ మోనోహరి, అశ్రీత, ఏ యంఓ మోతిలాల్, సబ్ యూనిట్ ఆఫిసర్ శ్రీనివాసరాజు, సూపర్వైసర్ వెంకన్న, మనోజ్ రెడ్డి, కడారి రమేష్, సైదులు,ఏ ఎన్ యం, ఆశాలు పాల్గొన్నారు.