calender_icon.png 19 May, 2025 | 10:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఇస్కాన్ ముంబైది కాదు

17-05-2025 12:03:56 AM

  1. ఇస్కాన్- హరేకృష్ణ సుప్రీం తీర్పు 

25 ఏళ్ల పోరాటంపై బెంగుళూరు భక్తుల విజయం

హైదరాబాద్, -మే 15 (విజయక్రాంతి): శ్రీల ప్రమపాదుల వారిని ఇస్కాన్ ఆచార్యుడిగా స్థాపించడానికి ఇస్కాన్ భక్తులు 25సంవత్సరాల పాటు చేసిన పోరా టం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుతో విజయవంతమైంది. సుప్రీంకోర్టు ప్రకారం శ్రీల ప్రభుపాద ఇస్కాన్ యొక్క ఏకైక ఆచార్యుడని ఇస్కాన్‌బెంగళూరు నిరూపించడంలో సఫలమైంది.

బెంగళూరులోని ఇస్కాన్- హరే కృష్ణ హిల్ ఆలయం ఇస్కాన్ సంస్థకు చెందినదని, ఇస్కాన్ చెందినది కాదని సుప్రీంకోర్టు ప్రకటించింది. అలాగే, ఇస్కావ్ ఇస్కాన్ కార్యకలాపాల్లో జోక్యం చేసుకో కూడదని ఆదేశించింది. 1977లో శ్రీల ప్రభుపాద మహాసమాధి తర్వాత కొంతమంది నాయకులు తమను తాము ఆచార్యులుగా ప్రకటించుకొని భక్తులకు దీక్ష ఇవ్వడం ప్రారంభించారు.

ఇది శ్రీల ప్రభుసాద రిత్విక్ విధానానికి విరుద్ధం. ఇస్కాన్ శ్రీల ప్రభుసాదను ఏకైక ఆచార్యుడిగా భావిస్తూ ఈ స్వయం-ప్రకటిత గురువిధానాన్ని వ్యతిరేకించింది. 2000లో ఇస్కాన్ ముంబై సంస్థ బెంగుళూరులోని హరేకృష్ణ హిల్ ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. దీనికి వ్యతిరేకంగా బెంగుళూరు భక్తులు ఈ 25 సంవత్సరాల న్యాయ పోరాటం చేసి, విజయం సాధించారు. 

ఈ సందర్భంగా ఇస్కాన్‌బెంగళూరు అధ్యక్షుడు, అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ మధు పండితదాస్ మాట్లాడుతూ.. “ఈ పోరాటం శ్రీల ప్రభుపాదుల వారి ఉత్తరాధికారిగా తమను తాము స్వయంగా ప్రకటిం చుకొని దీక్ష ఇచ్చే వారికి వ్యతిరేకంగా కొనసాగింది. ఇస్కా బెంగళూరు ఎల్లప్పుడూ భక్తులందరూ శ్రీల ప్రభుపాద శుద్ధ శిష్యులని, ఆయనే అస్కావ్ శాశ్వత ఆచార్యుడని నమ్మింది. ఈ తీర్పు మా సత్యానికి న్యాయపరమైన ధ్రువీకరణను అందించింది” అని చెప్పారు.