17-05-2025 12:04:43 AM
ఏరియా టీబీజీకేయస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి
మణుగూరు మే 16 (విజయ క్రాంతి): ఏజెన్సీ ప్రాంతంలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్య ప్రమాణాలు పాటిస్తూ, సింగరేణి కార్మికులు, ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న మణుగూరు సింగరేణి పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్ట లను వెంటనే భర్తీ చేయాలని ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు డి మాండ్ చేశారు .
శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ టి బి జి కె యస్ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. విద్య సంవత్సరం ప్రారంభం గడువు . మరి కొద్ది రోజులే ఉందని ఆలస్యం కాకుండా వెంటనే సింగరేణి పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్ట్ లను భర్తీ చేయాలన్నా రు.. గత విద్యా సంవత్సరం తాత్కాలిక ప్రాతిపదికన ఏడాది గడువుతో పారదర్శకంగా ఉపాధ్యాయ పోస్ట్ లు భర్తీ చేసినప్పటికీ చాలా మంది విద్య సంవత్సరం మధ్యలోనే వారికి ఇతర అవకాశాలు వస్తే పాఠశాలను వదిలి వెళ్లిపోయారని తెలిపారు.
ఆ ప్రభావం పాఠశాలలో పని చేసే ఇతర ఉపాధ్యాయ లపై పడిందన్నారు. ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రా మ చందర్ సమీక్ష సమావేశాలు, పాఠశాల కరస్పాండెంట్ రమేష్ నిరంతర పర్యవేక్షణ, అంకితభావం తో పని చేసే అధ్యాపకులు అత్యంత కష్టపడి పిల్లలకు విద్యను బోధించి పదవ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించారన్నారు. కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్ట్ లతో పాటు ఇతర పోస్ట్ లు భర్తీ చేయాలన్నారు.
ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్, పాఠశాల కరస్పాండెంట్ రమేష్ ప్రత్యేక చొరవ ద్వారా వచ్చే ఏడాదికి మణుగూరు సింగరేణి పాఠశాలలో సి బి యస్ ఈ సిలబస్ ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ఈ ఏడు పదవతరగతి ఫలితాల్లో నా కూడా అద్భుతమైన ఫలితాలు రాబట్టడం కోసం శ్రమించి కష్టపడే వారితో భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇజ్రాయిల్, రామాచారి పవన్ కుమార్, రాజ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.