డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
10-03-2026 03:03 AM
ముషీరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అప్లైడ్ ఏఐ కంపెనీ అయిన ఫినోమ్ తన కార్యాలయాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరు పుకుంటూ గ్లోబల్ థీమ్ ‘గివ్ టూ గేయిన్’ను అనుసరిస్తూ మహిళలను సైబర్ భద్రత, డిజిటల్ సేఫ్టీపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించిందని ఫినోమ్ హెడ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం డిజిటల్ ప్రపంచంలో కార్యాల యాల్లో మహిళల సంక్షేమం, ఆత్మ విశ్వాసం, భద్రత, సోషల్ మీడియాలో జాగ్రత్తలు, డిజిటల్ మోసాలపై రాష్ట్ర సీఐడీ, మహిళల భద్రత, సైబర్ సెక్యూరిటీ విభాగం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శిఖా గోయెల్, ఫినోమ్ ఎండీ నిర్మలా దేవి గౌరవ అతిథులుగా హాజరై పలు సూచనలు చేశారు.




