మండుతున్న ఎండలు
10-03-2026 03:03 AM
35 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. మంగళ, బుధ, గురువారాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్ లో సోమవారం అత్యధికంగా 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి మూడో వా రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశమున్నట్లు సూచించింది.




