calender_icon.png 22 July, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీలో జరుగుతున్న సింగిల్ ప్యాకేజీ పనులపై విచారణ చేపట్టాలి

22-07-2025 12:55:54 AM

  1. టెండర్ ప్రక్రియ జరగకుండా వర్క్ ఆర్డర్ ఎలా ఇస్తారు?
  2. మున్సిపల్ అధికారుల తీరుపై ముఖ్యమంత్రికి లేఖ రాసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల అర్బన్, జూలై 21 (విజయ క్రాంతి): జగిత్యాల మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం చేపట్టిన సింగిల్ ప్యాకేజీ పనులపై విచారణ చేపట్టాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల మున్సిపాలిటీలో15.6 కోట్లతో వివిధ వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సింగిల్ ప్యాకేజ్ గా రూపొందించి స్థానిక కాం ట్రాక్టర్లకు అవకాశం లేకుండా చేశారన్నారు.కేవలం 15 శాతం మాత్రమే బీట్ రోడ్డు తో స్పెషల్ గ్రేడ్ కాంట్రాక్టర్లు హాట్ మి క్స్, వెట్ మిక్స్ ప్లాంట్ ఉన్న వారు మాత్రమే పాల్గొనే అవకా శం లభించడంతోస్థానికులు కాంట్రాక్ట్ లో పాల్గొనే అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీ తరపున గతంలోనే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు.

టెండర్ ఫార్మాలిటీస్, అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతనే వర్క్ ఆర్డర్ జారీ చేయాల్సి ఉండగాఏవిధమైన టెండర్ అగ్రిమెంట్ లేకుండా వర్క్ ఆర్డర్ లేకుండా పది వా ర్డుల్లో పనులు చేపట్టడాన్ని జీవన్ రెడ్డి తప్పుపట్టారు. మున్సిపల్ అధికారులు మార్కౌట్ ఇవ్వకుండా కాంట్రాక్టర్ పనులు ఎలా చేపడుతారని ప్రశ్నించారు. ఆన్లైన్ లో ఇంజనీరింగ్ అధికారుల ధృవీకరణ లేకుండా పనులు చేపట్టడం ఆశ్చర్యం క లిగిస్తుందన్నారు.

ఈ పనులు చేపడుతున్నగౌరి శంకర్ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ ఎవరిదని, ఆ సంస్థకు ప్రభుత్వ నిబంధనలు వర్తించవా.. వారికి చట్టంలో ఏమైనా మినహాయింపు ఉందా.. అని ప్రశ్నించారు. ప్రత్యేక అధికారి, కలెక్టర్ ఆధ్వర్యంలో ము న్సిపాలిటీ నియమ నిబంధనలను అనుగుణంగా పనులు జ రుగుతాయని ఆశిస్తే గత బీ ఆర్ ఎస్ పాలన లాగే కనపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అగ్రిమెంట్ లేకుండా, వర్క్ ఆర్డర్ జారీచేయకుండా చేపడుతున్న పనుల విషయంపైముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి లేఖా ద్వారా తీసుకెళ్తున్నానని జీవన్ రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై కలెక్టర్ విచారణ చేపట్టి బాధ్యుల పై చర్యలు తీసు కోవాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బండ శంకర్, కళ్లేపల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, జున్ను రాజేందర్, కొండ్ర జగన్, పూర్ణ చందర్ రె డ్డి, షేక్ చాంద్ పాషా, మన్సూర్, మున్నా,నేహాల్, పుప్పాల అ శోక్,రఘు,రజనీకాంత్, గుండ మధు తదితరులుపాల్గొన్నారు.