10-12-2025 02:26:34 AM
జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి
మొయినాబాద్, డిసెంబరు9 (విజయ క్రాంతి ): పంచాయతీ ఎన్నికల్లో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నేపథ్యంలో అధికారులకు, ప్రజలు సహకారం అందించాలని జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.మంగళవారం మొయినాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల్లో పాల్గోనే సిబ్బంది కి శిక్షణ కార్యక్రమం ఎంపీడీఓ సంధ్యారాణీ అధ్యక్షతన నిర్వహించారు.
శిక్షణ కార్యక్రమానికి జెడ్పిసిఓ కృష్ణారెడ్డి పాల్గోని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచిం చారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. ఎన్నికల రోజు అందరూ అప్రమత్తంగా ఉండాలని చిన్నపాటి సమస్య వచ్చినా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.