calender_icon.png 11 December, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థుల పరిశ్రమ సందర్శన

10-12-2025 02:27:43 AM

ఘట్ కేసర్, డిసెంబర్ 9 (విజయక్రాంతి) : పోచారం సర్కిల్ వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్శిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ విద్యార్థులు బాచుపల్లి లోని హరిత ఇండస్ట్రీస్  ప్రైవేట్  లిమిటెడ్ ను సందర్శించారు.

మెకానికల్ విభాగం లోని డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరిశ్రమ సందర్శనలో  మేనేజింగ్ డైరెక్టర్ పి. వెంకటరాజు విద్యార్థులకు వివిధ విడిభాగాల తయారీ పద్దతులు,  ఉత్పత్తి ప్రక్రియలు, కల్పన సాంకేతికతలు, నాణ్యత ప్రమాణాలపై  ప్రాయోగిక అవగాహన కల్పించారు.

ఈసందర్శనను అధ్యాపకులు డాక్టర్ జష్ కుమార్ లు సమన్వయం చేశారు. ఈఅవకాశం కల్పించిన డీన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ వి. విజయ్ కుమార్, అసోసియేట్ డీన్  మెకానికల్ విభాగ అధిపతి డాక్టర్ కె. శ్రీనివాస చలపతి, అనురాగ్ యూనివర్శిటీ మేనేజ్మెంట్, హరిత ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజ్మెంట్ కు విద్యార్ధులు కృతజ్ఞతలు తెలిపారు.