calender_icon.png 15 December, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

10-12-2025 02:25:27 AM

ఘట్‌కేసర్, డిసెంబర్ 9 (విజయక్రాంతి) : గ్రేటర్ హైదరాబాద్ ఘట్ కేసర్ పట్టణంలో మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిoడ్ల ముత్యాల్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ నాయకులు పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్  రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సoదర్భంగా కేక్ కట్ చేసి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. 

మేడ్చల్ నియోజకవర్గం బీబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, మున్సిపల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ సభ్యులు మచ్చెందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్,

రైతు సమన్వయ సమితి మండల మాజీ అధ్యక్షుడు కొంతo అంజిరెడ్డి, మైనారిటీ సెల్ జిల్లా కార్యదర్శి రెహమాన్, మాజీ వార్డు సభ్యులు వి.బి. వెంకటనారాయణ ముదిరాజ్, కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ మెరుగు నరేష్ గౌడ్,  ఎస్సీ సెల్ అధ్యక్షుడు  శ్రీనివాస్, మైనారిటీ సెల్ సీనియర్ నాయకులు అబ్దుల్ ఖయ్యూమ్, సీనియర్ నాయకులు కె. నర్సింగ్ రావు, మెట్టు రమేష్, తోక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

శామీర్‌పేట్..

శామీర్‌పేట్, డిసెంబర్ 9: కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాట ఇస్తే తప్పరని, అందుకు నిదర్శనమే తెలంగాణ ఏర్పాటని మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్ అన్నారు.

మంగళవారం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని వీర రెడ్డి విగ్రహం వద్ద సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.  మూడు చింతలపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్, ఏ బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్  పాల్గొన్నారు.

జవహర్‌నగర్‌లో

జవహర్నగర్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియాగాంధీ జన్మదిన వేడుకలను జవహర్నగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.  కార్యక్రమానికి జవహర్నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై, కాంగ్రెస్ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 

మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, సీనియర్ నాయకులు సదానంద్, కోటేష్ గౌడ్, జిల్లా ఎస్సీ సెల్ మహిళా కన్వీనర్ గండి సునీత, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లా వినయ్ కుమార్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చింత విజయ, సేవాదళ్ అధ్యక్షుడు కాసోజు యాకచారి, బీసీ సెల్ అధ్యక్షుడు భాస్కర్ రావు, మాజీ కార్పొరేటర్ గొడుగు వేణు, బింగి సతీష్ గౌడ్ లు పాల్గొన్నారు.