calender_icon.png 25 October, 2025 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దర్శకుడిగా మారుతున్నా

23-10-2025 01:22:05 AM

సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బట్టలరామస్వామి బయోపిక్కు, కాఫీ విత్ ఏ కిల్లర్, సోలోబాయ్ సినిమాలను నిర్మించటం ద్వారా ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు సెవెన్ హిల్స్ సతీశ్. అక్టోబర్ 23న తన పుట్టినరోజు సందర్భంగా నూతన ప్రయాణం మొదలుపెట్టనున్నారు. ఈ విషయాన్ని ఆయన బుధవారం ప్రెస్‌మీట్‌లో ప్రకటించారు.

త్వరలో దర్శకుడిగా మారబోతున్నట్లు తెలిపారు. డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చిన తాను నిర్మాతగా ప్రారంభమై సినిమా నిర్మాణానికి అన్నీ నేర్చుకుని పూర్తిగా సన్నద్ధం అయిన తర్వాత తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తన బ్యానర్‌లో మరో రెండు సినిమాలు తీస్తున్నట్లు చెప్పారు. ఎడిటర్ ప్రవీణ్ పూడి దర్శకత్వంలో ఒక సినిమా తీస్తున్నామని, రాజశేఖర్ గడ్డం దర్శకత్వంలో ఇంకో చిత్రం స్క్రిప్ట్ దశలో ఉందని చెప్పారు. ఈ రెండు సినిమాల అప్‌డేట్స్ వచ్చే ఏడాదిలో ఇస్తామన్నారు.