calender_icon.png 25 October, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యాపీ బర్త్ డే

23-10-2025 01:20:35 AM

రెబల్ ఫ్యాన్స్‌కు దీపావళితోపాటు వచ్చే పండుగ ప్రభాస్ పుట్టినరోజు. అది ఈ రోజే. 1979 అక్టోబర్ 23న ఆయన ప.గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన ప్రభాస్ గురువారం 46వ పడిలోకి అడుగుపెడుతున్నారు. 2002లో ‘ఈశ్వర్’ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్.. తన స్టార్‌డమ్, చరిష్మా, పర్‌ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, రికార్డ్ స్థాయి బాక్సాఫీస్ వసూళ్లతో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చారు. దేశం నలుమూలలా ఆయన అభిమానులున్నారు. ఓవర్సీస్‌లో యూఎస్, యూకే, జపాన్.. ఇలా ప్రతి దేశంలోనూ ప్రభాస్ సినిమాల కోసం ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీలో పేరు తెచ్చుకునే హీరోలను చూస్తుంటాం.. టాలీవుడ్‌కే పేరు తెస్తున్న అరుదైన స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్.