calender_icon.png 25 October, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ ఫేమస్ బీజీయమే ఈ సినిమాకు టైటిల్!

23-10-2025 01:23:49 AM

శివాజీ, లయ జంటగా మరోచిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుధీర్ శ్రీరామ్ రచనాదర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టు శ్రీశివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. శివాజీ ఇందులో పంచాయతీ సెక్రెటరీ శ్రీరామ్‌గా కనిపించనుండగా, ‘90స్’ వెబ్‌సిరీస్ ఫేమ్ బాల నటుడు రోహన్, అలీ, ధనరాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పృథ్వీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని’ అనే టైటిల్ పెట్టామని ప్రకటించారు. ‘90స్’ సిరీస్‌లోని ఫేమస్ బీజీఎంనే ఈ సినిమాకు శీర్షికగా పెట్టడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథలో ఒక క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉన్నట్లు టీమ్ తెలిపింది. రంజిన్ రాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రిత్విక్‌రెడ్డి కెమెరామెన్‌గా, బాలు మనోజ్ డీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.