calender_icon.png 26 July, 2025 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి..

25-07-2025 11:31:05 PM

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బెల్లంపల్లి కాంగ్రెస్ ప్రతినిధులు

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ ప్రతినిధులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ఒక నివేదికను ఎమ్మెల్యే గడ్డం వినోద్ సీఎం రేవంత్ రెడ్డి కి నివేదించారు. అన్ని రంగాల్లో బెల్లంపల్లి పారిశ్రామిక పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చొరవను కనబరచాలని సీఎంను కోరారు. అందుకోసం ప్రత్యేకంగా తగినన్ని నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు.