26-07-2025 12:00:00 AM
నిజామాబాద్ జులై 25: (విజయక్రాంతి): సమాజంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ నిత్యం బిజీగా ఉండే జర్నలిస్టులు ప్రాణప్రాయంలో ఉన్న వారికి రక్త దానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచ వీరు మానవతా దృక్పథంతో ప్రాణ పయంలో ఉన్న వారికి రక్త దానం చేయడం వారి మానవత దృక్పథానికి అద్దం పడుతోంది. ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న ఒకరి కి రక్తదానం చేసి మానవత్వాన్ని నిరూపించుకున్నారు.
నిజామాబాద్ కు చెందిన జర్నలిస్టులు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాదు నగరంలోని గాయత్రి నగర్ లో ఉన్న అఖిలేష్ అనే చిన్నారికి డెంగ్యూ వ్యాధి సోకడంతో శరీరంలోని రక్త కణాలు అవసరానికి మంచి తగ్గిపోయాయి కేవలం రక్తం ఎక్కించడం అత్యవసరమని డాక్టర్ తెలియజేశారు.
అత్యవసరంగా రెండు డిబిఆర్ అనే రక్తకణాలు శరీరంలో ఎక్కించడం వల్ల ప్రాణాపాయం ఉండదని అఖిలేష్ కుటుంబానికి డాక్టర్లు సూచించారు. దీంతో నిజామాబాదు పట్టణానికి చెందిన జర్నలిస్టులు ఐ న్యూస్ రిపోర్టర్ రవితేజ రెడ్డి, మహా న్యూస్ ఛానల్ కెమెరామెన్ గణేష్ సుభాష్ వాగ్మా రే రాజు గుప్త రక్తదానం చేసి ఆ బాలుణ్ణి ప్రాణాపాయం నుండి కాపాడటంలో సహకరించారు. రెడ్ క్రాస్ సిబ్బంది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి అభినందించారు.