calender_icon.png 12 September, 2025 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రేడ్ ఎక్స్పో పోస్టర్‌ను ఆవిష్కరించిన బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్

12-09-2025 07:32:27 PM

బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో బెల్లంపల్లి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ చేతుల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మనోజ్ మాట్లాడారు. ఈ నెల 19,20,21,తేదీలలో హైదరాబాద్ నార్సింగ్ లోనిఓం కన్వెన్షన్ హల్ లో జరుగనున్న ఎక్స్పో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫోటోగ్రఫీ ఒక సృజనాత్మకత పూర్తిగా మారిందన్నారు. ఇలాంటి ఎక్స్పోలుకు కొత్త పరికరాలు డిజిటల్ టెక్నాలజీలు ప్రజలకు చేరువ కాలంలో దోహదపడుతాయన్నారు.

యువత ఈ రంగాన్ని వృత్తిగా ఎంచుకోవడం ద్వారా మంచి అవకాశాలను పొందగలరన్నారు. ఫోటోగ్రఫీ రంగం ఇప్పుడు రానున్న టెక్నాలజీ కూడా ఫోటోగ్రాఫర్లు వాడుకోవాలని ఎక్స్పోలో కెమెరాలు, లెన్స్, డ్రోన్లు ప్రింటింగ్ పరికరాలు లైటింగ్ సిస్టం ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు స్టూడియో మోడల్స్ ప్రదర్శించినట్లు తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గం లోని ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు, ప్రొఫెషనల్ స్టూడియోలు ఆసక్తిగల యువత తప్పక పాల్గొని ప్రయోజనకం పొందాలని కోరారు.