calender_icon.png 12 September, 2025 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన మండల అధికారులు

12-09-2025 07:25:17 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ లో గల కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను శుక్రవారం ఖానాపూర్ మండల్ అధికారులు తనిఖీ చేశారు .ఈ సందర్భంగా విద్యార్థులకు పోషకాహారం, విద్యాబోధన, పరిసరాల పరిశుభ్రత, పరిశీలించారు. మండల ప్రత్యేక అధికారి జీవరత్నం, ఎంపీడీవో సిహెచ్ రత్నాకర్ రావు, పాఠశాల రికార్డులను, వంటశాలను పరిశీలించారు. అనంతరం అదే గ్రామంలో జెడ్పీఎస్ ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భోనగిరి నరేందర్ కు ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు వచ్చినందుకు ఆయనను సాలువాతో సత్కరించారు. అనంతరం మండలంలో తర్లాపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పరిశీలించి, వేగంగా పనులు చేసి స్లాబ్ వేయించిన లబ్ధిదారుని తమ కార్యాలయంలో సన్మానించారు.