calender_icon.png 12 September, 2025 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇష్టంగా చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలి

12-09-2025 07:38:03 PM

జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్

గద్వాల టౌన్: బలవంతంగా కాకుండా, ఇష్టంగా చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో 10వ తరగతి విద్యార్థులకు లక్ష్య నిర్దేషము, జీవన నైపుణ్యాలపై ప్రేరణ తరగతులను సైకాలజిస్ట్, మోటివేటర్ తో ప్రత్యేక తరగతులు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ, చదువుకు సమస్యలు అడ్డుకాకూడదని, సమస్యలన్నింటిని పక్కనపెట్టి కష్టమైనప్పటికీ ఇష్టంగా చదివి విజయం సాధించాలన్నారు.

గతంలో తను కూడా ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసినప్పటికిని, ఇతరులతో ప్రేరణ పొంది ఐఏఎస్ కాగలిగానున్నారు. జీవితంలో చదువు చాలా ముఖ్యమైన దాని, చదువులను నిర్లక్ష్యం చేసి చాలా మంది విద్యార్థులు పాఠశాలలకు సక్రమంగా హాజరు కాకుండా పత్తి చేన్లలో పనులకు వెళ్తుండడం గమనించడం జరిగిందని, హాజరు శాతం తగ్గిపోవడం వల్ల 10వ తరగతిలో ఆశించినంతగా ఫలితాలు రావడం లేదన్నారు.  గత సంవత్సరం రాష్ట్రస్థాయిలో 26వ స్థానం సాధించినప్పటికిని, ఈసారి విద్యార్థులు జిల్లాలో 100 శాతం ఫలితాలు సాధించాలానే లక్ష్యంతో రెండు సెషన్లలో ప్రేరణ తరగతులను నిర్వహించడం జరుగుతుందన్నారు.