calender_icon.png 9 October, 2025 | 11:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులను వెంటనే విడుదల చేయాలి

09-10-2025 09:48:23 AM

మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నరసింహస్వామి     

వరంగల్,(విజయక్రాంతి): గత నాలుగు సంవత్సరాలుగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి దుబ్బరి నరసింహ స్వామి హాజరై మాట్లాడారు. అనంతరం మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తుప్పరి నరసింహ స్వామి మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత 15 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా ప్రైవేటు పాఠశాలలలో ప్రతి సంవత్సరము సంబంధిత కలెక్టర్ ఆధ్వర్యంలో కొంతమంది విద్యార్థులు ఎంపిక చేసి వారికి ఉన్నతమైన విద్యను అందించేందుకు అర్హత కలిగిన ప్రవేట్ విద్యాసంస్థల్లో కొన్ని సీట్లు కేటాయించడం జరుగుతుంది.

ఈ విద్యార్థులు ఫీజు ప్రభుత్వమే నేరుగా ప్రైవేటు విద్యాసంస్థలకు అందించడం జరుగుతుంది కానీ గత నాలుగు సంవత్సరాల నుండి విద్యార్థుల యొక్క ఫీజులు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల ప్రైవేటు పాఠశాల యజమానియాలు విద్యార్థులు పాఠశాలలోనికి రానివ్వడం లేదు. తద్వారా విద్యార్థులు చదువుకుంటూ పడే అవకాశం ఉంది కావున కలెక్టర్ సంబంధిత మంత్రితో మాట్లాడి  విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠశాలలో విద్యను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నామన్నారు.ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు, బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర నాయకుడు నాను నాయక్,తల్లిదండ్రులు పసుల యుగంధర్, పసుల బిక్షపతి, కారు స్వామి, పి డి ఎస్ యు,ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు