09-10-2025 09:05:17 AM
హైదరాబాద్: తనతో పాటు నేతల హౌస్ అరెస్టులపై(House Arrest) బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ చలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిందని కేటీఆర్ వెల్లడించారు. తక్షణమే బస్సు ఛార్జీల పెంపు వెనక్కి తీసుకోవాలని కోరాలని అనుకున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్సులు ఎక్కి వెళ్తామంటే భారీగా పోలీసులను మోహరించారని మండిపడ్డారు. ఒక వ్యక్తిని బస్సు ఎక్కకుండా ఆపడానికి ఇంతమంది పోలీసులను పంపారని చెప్పారు.
ఈ ఉత్సాహం హైదరాబాద్ లో నేరాల అదుపులో చూపిస్తే మంచిందని కేటీఆర్ సూచించారు. ఎన్ని రకాల కుట్రలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను వెనక్కి తీసుకొనే దాకా నిరసన తెలుపుతూనే ఉంటామని హెచ్చరించారు. పోలీసు నిర్భంధాలు తమకు, బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని వివరించారు. బీఆర్ఎస్ “ఛలో బస్ భవన్” కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులు అడ్డంకులు కలిగించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, జవహర్‌నగర్ బీఆర్ఎస్ పార్టీ ప్రధమ మేయర్ మేకల కావ్యతో పాటు పలువురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.