calender_icon.png 9 October, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి

09-10-2025 10:49:22 AM

హైదరాబాద్: ఆర్టీసీ బస్ భవన్(RTC Bus Bhavan) వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హరీశ్ రావు, కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao), తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, వాణిదేవితో పాటు పలువురు నేతలు బస్ భవన్ కు చేరుకున్నారు. హైదరాబాద్ లో బస్సు ఛార్జీల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ చలో బస్ భవన్(BRS Chalo Bus Bhavan)కు పిలుపునిచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ నేతలు(BRS leaders) ఆర్టీసీ బస్సుల్లో బస్ భవన్ కు చేరుకుంటున్నారు. బస్సుల్లో ప్రయాణికుల అభిప్రాయాలను నేతలు తెలుసుకున్నారు.

హరీశ్ రావు(Thanneeru Harish Rao) మెహదీపట్నం నుంచి బస్ భవన్ కు బస్సులో చేరుకున్నారు. కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ రేతిఫైల్ బస్టాండ్ నుంచి బస్ భవన్ కు వెళ్తారు. బీఆర్ఎస్ నేతల చలో బస్ భవన్ తో ఆర్టీసీ బస్ భవన్ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు ఇబ్బంది కలిగింది. ఆర్టీసీ బస్ భవన్ వైపు వచ్చే వాహనాలను పోలీసులు మళ్లించారు. అటు ఆర్టీసీ బస్ భవన్ వద్ద 1000 మందికి పైగా పోలీసులు మోహరించారు. ఆర్టీసీ బస్ భవన్ కు వచ్చే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి బీఆర్ఎస్ నేతలు వినతి పత్రం ఇవ్వనున్నారు. బస్ భవన్ కు చేరుకున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది.