calender_icon.png 9 October, 2025 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంటైనర్‌ ఢీకొని హోంగార్డు మృతి

09-10-2025 09:16:23 AM

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri) రామన్నపేటలో కంటైనర్ దూసుకెళ్లి హోంగార్డు(Home Guard) మృతి చెందాడు. రామన్నపేట సుభాష్ సెంటర్(Ramannapet Subhash Center) వద్ద గురువారం ఉదయం 4.15 గంటలకు వాహన తనిఖీలు నిర్వహించారు. కంటైనర్ ఆపకుండా వెళ్లిన భువనగిరి నుంచి చిట్యాల వైపు దూసుకెళ్లింది. కంటైనర్ ను ఆపేందుకు రామన్నపేట హోంగార్డు ఉపేంద్రచారి ప్రయత్నించారు. కంటైనర్ ఆపకుండా దూసుకెళ్లడంతో హోంగార్డు ఉపేంద్రచారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కంటైనర్ తో పరారైన డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి(Choutuppal ACP Madhusudhan Reddy)  ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. హోంగార్డు ఉపేంద్రచారి స్వస్థలం రామన్నపేట మండలం(Ramannapet Mandal) సిరిపురం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.