calender_icon.png 9 October, 2025 | 1:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

09-10-2025 11:39:20 AM

హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌(ZPTC MPTC Local Body Election Schedule) గురువారం విడుదల అయింది. దీంతో మొదటి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లు స్వీకరణ ప్రారంభం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ కార్యాలయాల్లో ఈనెల 11 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 53 రెవెన్యూ డివిజన్లలో తొలివిడతలో 292 జడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి.

రాష్ట్ర ఎన్నికల సంఘం(State Election Commission) గత నెల 29న షెడ్యూల్, నోటిఫికేషన్ జారీ చేసింది. 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్ జరగనునంది. నవంబర్ 11న ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో తీసుకువచ్చింది. ప్రస్తుతం దీనిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇవాళ సాయంత్రం వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. రిజర్వేషన్ల తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.