calender_icon.png 9 October, 2025 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం దిగి రాకపోతే ప్రజా ఉద్యమాలు బలోపేతం చేస్తాం

09-10-2025 09:46:16 AM

హైదరాబాద్: అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ టికెట్ల ధరలు(RTC Bus Charges hike) వెంటనే తగ్గించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Raoడిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల్లో రాజ్యాంగ రక్షణ... చేస్తున్నది రాజ్యాంగ భక్షణ అన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ పోరాడుతున్న ప్రతి సారి బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు, అరెస్టులు చేయడం ఇదేనా ప్రజాస్వామ్యం రాహుల్ గాంధీ? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఆర్టీసీకి గ్రాంటు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఆర్టీసీకి మహాలక్ష్మి బకాయిలు లేకుండా ప్రభుత్వం చూడాలని కోరారు. చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సూచించారు.

మియాపూర్, ఉప్పల్ వర్క్ షాపులను విక్రయానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీపై ప్రేమ ఉంటే వర్క్ షాపుల ప్రైవేటీకరణ(Privatization of workshops) ఆపాలని సవాల్ విసిరారు. ఇప్పటికే ఐదుసార్లు బస్సు ఛార్జీలు పెంచారని, మహిళలకు ఉచితమంటూనే పురుషులకు ఛార్జీలు పెంచారని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఎడమ చేతితో ఇస్తూ కుడి చేతితో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఛార్జీలు(RTC fares) తగ్గించే వరకు ప్రజల తరుఫున బీఆర్ఎస్ పార్టీ పోరాడుతోందని హరీశ్ రావు హెచ్చరించారు. వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆర్టీసీ బస్సులో ఎక్కి ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకుంటామని తెలిపారు. ఆర్టీసీ ఎండీని కలిసి ఛార్జీలు తగ్గించాలని కోరుతామన్నారు. ప్రభుత్వం దిగి రాకపోతే ప్రజా ఉద్యమాలు బలోపేతం చేస్తామని హెచ్చరించారు.