09-10-2025 09:50:21 AM
గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీలోని సిజిఆర్ కార్యాలయంలో గుమ్మడిదల మండల హెవీ డ్రైవర్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి యూనియన్ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... హెవీ డ్రైవర్ యూనియన్ సభ్యుల సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాను. సభ్యులందరికీ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించేందుకు సిజిఆర్ ట్రస్ట్ తరఫున సహాయం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు బక్క సత్యనారాయణ, ఉపాధ్యక్షులు పి. యాదగిరి, సెక్రటరీ శంకర్ యాదవ్, కోశాధికారి నీరుడి ప్రవీణ్ కుమార్, కమిటీ సభ్యులు మల్లేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.