calender_icon.png 2 August, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం భగవంత్ కేసరి

02-08-2025 12:39:01 AM

  1. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించిన కేంద్రం  
  2. ఏడు అవార్డులు సొంతం చేసుకున్న తెలుగు సినిమాలు 
  3. బేబి, హను-మాన్ చిత్రాలకు రెండేసి అవార్డులు 

71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను ఈ అవా ర్డులను ప్రకటించగా, తెలుగు సిని మాలు ఏడు కేటగిరీల్లో అవార్డులు దక్కించుకున్నాయి. రెండు సినిమాలు రెండేసి అవార్డులతో సత్తా చాటాయి. మొత్తం 22 భాషల్లో 115 సినిమాలను వీక్షించిన జ్యూరీ కమిటీ అవార్డులను ప్రకటించింది. నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాను ఉత్తమ ప్రాంతీ య తెలుగు చిత్రంగా ప్రకటించారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ తెలంగాణ యాసలో డైలాగులు చెప్పారు. హనుమాన్, బేబి సినిమాలు రెండేసి అవార్డులు దక్కించుకున్నాయి. బేబి సినిమాకు సంబంధించి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ విభాగానికి సాయి రాజేశ్‌కు, ఇదే చిత్రంలోని ‘ప్రేమిస్తున్నా’ పాట పాడిన పీవీఎన్‌ఎస్ రోహిత్‌కు బెస్ట్ మేల్ సింగర్‌గా అవార్డు దక్కింది.

ఇక తేజ సజ్జ హీరోగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హను-మాన్’ ఉత్తమ యానిమేషన్-విజువల్ ఎఫెక్ట్స్ విభాగంతోపాటు, ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ కేటగిరీలోనూ అవార్డులు గెలుచుకుంది. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమాకు ప్రశాంత్‌వర్మ దర్శకత్వం వహించారు.

బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతివేణి (గాంధీ తాత చేటు) ఎంపికైంది. బెస్ట్ లిరిక్స్ కేటగిరిలో కాసర్ల శ్యామ్ (బలగం సినిమాలో ఊరు పల్లెటూరు పాట)ను అవార్డు వరించింది. వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విశేష ప్రేక్షకాదరణ పొందగా, ఇప్పుడు అవార్డు గెలుచుకున్న పాటను రామ్ మిర్యాల, మంగ్లీ పాడారు.  

తెలుగు సినిమా తళుక్కు

  1. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించిన కేంద్రం 
  2. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం భగవంత్ కేసరి 
  3. ఏడు అవార్డులు సొంతం చేసుకున్న తెలుగు సినిమాలు
  4. బేబి, హను-మాన్ చిత్రాలకు రెండేసి అవార్డులు 

జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. మొత్తం ఏడు కేటగిరీల్లో అవార్డులు దక్కించుకున్నాయి. రెండు సినిమాలు రెండేసి అవార్డులతో తళుక్కుమన్నాయి. మొత్తం 22 భాషల్లో 115 సినిమాలను పరిశీలించి అవార్డులను ప్రకటించారు.

ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్, ఉత్తమ దర్శకుడిగా సుదీప్తో సేన్ (ది కేరళ స్టోరీ-హిందీ), ఉత్తమ నటులు గా షారుక్ ఖాన్ (జవాన్-హిందీ), విక్రాంత్ మస్సే (12th ఫెయిల్-హిందీ), ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే ఎంపికయ్యారు.

ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా భగవంత్ కేసరి, ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్) రచయితగా సాయిరాజేశ్ నీలం (బేబి), ఉత్తమ ఏవీజీసీ (యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్) చిత్రంగా హను-మాన్, ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ చిత్రంగా హను-మాన్, ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి (గాంధీ తాత చెట్టు), ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్ (బలగం), ఉత్తమ నేపథ్య గాయకుడిగా రోహిత్ (బేబి) పురస్కారాలను అందుకోనున్నారు.


ఈ గౌరవం చిత్రబృందానికే 

‘భగవంత్ కేసరి’ 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం ఎంతో గర్వకారణం. ఈ గౌరవం మా చిత్రబృందానికే చెందుతుంది. నిర్మాతలు సాహు గారపాటి, హరీశ్ పెద్ది, దర్శకుడు అనిల్ రావిపూడితోపాటు నటులు, సాంకేతిక నిపుణులు.. ఇలా అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది. ఇతర విజేతలకు అభినందనలు. వారి ప్రతిభ భారతీయ సినీరంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఈ గుర్తింపు మాకు మరింత స్ఫూర్తినిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షక హృదయాలను తాకే శక్తిమంతమైన కథలను అందించాలన్న మా తపనను రెట్టింపు చేస్తుంది. 

 బాలకృష్ణ, నటుడు

క్రియేటర్స్‌కు కిక్‌నిస్తుంది 

‘భగవంత్ కేసరి’.. నా కెరీర్‌లో చేసిన విభిన్న ప్రయత్నం. నేను నమ్మినట్టుగానే ప్రేక్షకులు దాన్ని ఆదరించారు. ఈ పురస్కారం బోనస్ అని అనుకుంటున్నా. మా ప్రయత్నానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది. కమర్షియల్ ఎలిమెంట్‌తోనే ‘బనావో బేటీకో షేర్’ కాన్సెప్ట్‌ని చెప్పగలిగాం. గుడ్ టచ్-బ్యాడ్ టచ్ లాంటి సున్నితమైన అంశాన్ని బాలకృష్ణలాంటి స్టార్ హీరో నటనతో ప్రస్తావించగలిగాం. విజయంతోపాటు ఇలాంటి గుర్తింపు దక్కితే క్రియేటర్స్‌కు మంచి కిక్ వస్తుంది. మరిన్ని మంచి చిత్రాలను తెరకెక్కించేందుకు స్ఫూర్తినిస్తుంది.  

 అనిల్ రావిపూడి, దర్శకుడు 

తెలంగాణ సంస్కృతినిచాటిన పాట  

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నా నమస్కారం. ‘బలగం’ చిత్రంలోని ‘ఊరు పల్లెటూరు’ పాటకు నాకు జాతీయ స్థాయి పురస్కారం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణమైన బలగం చిత్ర దర్శకుడు వేణుకు, నిర్మాతలు హర్షిత్‌రెడ్డి, హన్షితరెడ్డి, దిల్ రాజులకు, ఇంత మంచి పాటకు సంగీతం సమకూర్చిన భీమ్స్‌కు, గాయకులు రామ్ మిర్యాల, మంగ్లీకు ధన్యవాదాలు. ఎందరో మహానుభావుల తర్వాత మళ్లీ నాకు ఈ అవార్డు దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నా. తెలంగాణ సంస్కృతిని, పల్లె స్వచ్ఛతను చాటి చెప్పిన ఈ పాట నాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడం.. తెలుగువాడిగా సంతోషపడుతున్నా. 

 కాసర్ల శ్యామ్, గీత రచయిత 

ఆనందంగా ఉంది: 

మా సినిమా ‘హను-మాన్’ యానిమేషన్-వీఎఫ్‌ఎక్స్, యాక్షన్ కొరియోగ్రఫీ.. ఈ రెండు కేటగిరీల్లో అవార్డులు దక్కించుకోవడం ఆనందంగా ఉంది. వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ వెంకట్‌కుమార్, స్టంట్ మాస్టర్స్ నందు, పృథ్వీలకు శుభాకాంక్షలు. 

 ప్రశాంత్‌వర్మ, దర్శకుడు 

ఇది మామూలు విషయం కాదు

బెస్ట్ స్క్రీన్‌ప్లే, బెస్ట్ మేల్ సింగ్.. ఈ రెండు ముఖ్యమైన విభాగాల్లో ‘బేబి’ సినిమా అవార్డులు దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా కెరీర్‌కు కీలకం. ఎందుకంటే స్క్రీన్‌ప్లేకు పురస్కారం దక్కడం మామూలు విషయం కాదు. నిర్మాత ఎస్కేన్ నన్ను నమ్మకపోతే ఈ సినిమా సాధ్యమై ఉండేది కాదు. 

 సాయి రాజేశ్, దర్శకుడు 

Soori