calender_icon.png 2 August, 2025 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాలీవుడ్‌కు 7 జాతీయ అవార్డులు హర్షణీయం

02-08-2025 12:11:00 AM

సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి  

హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఏడు అవార్డులు లభించడం పట్ల రాష్ర్ట సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందులో ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఎంపిక కావడం, తెలంగాణలోని పల్లె ఆప్యాయతను కళ్లకు కట్టినట్లు చూపిన బలగం సినిమాలోని పాటలకు కాసర్ల శ్యామ్‌కు జాతీయ అవార్డు లభించడం పట్ల మంత్రి వారికి అభినందనలు తెలిపారు. 

‘బలగం’కు అభినందనలు: కేటీఆర్  

బలగం సినిమాలోని ‘ ఊరు పల్లెటూరు ’ పాటకు బెస్ట్ రిలాక్స్ విభాగంలో జాతీయ అవార్డు రావడం అభినందనీయమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గేయ రచయిత కాసర్ల శ్యామ్, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, సినిమా టీమ్‌కు అభినందనలు తెలిపారు. తెలంగాణపల్లెకు పట్టం కట్టిన సినిమాకు అవార్డు దక్కడం గర్వకారణమన్నారు.