calender_icon.png 28 June, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాయామంతో మెరుగైన జీవనం

28-06-2025 12:01:08 AM

లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ వీరన్న

మహబూబాబాద్,(విజయక్రాంతి): ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మెరుగైన జీవనం కొనసాగించవచ్చని మహబూబాబాద్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ వీరన్న అన్నారు. మహబూబాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన మినీ జిమ్ లో రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ వంగ రామన్న స్పాన్సర్ తో సైక్లింగ్, రాజా డ్రెస్సెస్ అధినేత మాలే హేమాచందర్ రావు సహకారంతో ఏర్పాటు చేసిన వెయిట్ లిఫ్టింగ్ పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న పరిస్థితుల్లో ఆహారపు అలవాట్లతో పాటు శారీరక శ్రమ చాలా అవసరమని వ్యాయామం ద్వారా అనేక రోగాలను నయం చేసుకోవచ్చని తెలిపారు. శారీరక శ్రమకు వాకింగ్ తో పాటు జిమ్ ఐటమ్స్ కూడా రెగ్యులర్గా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. ప్రతిరోజు ఉదయం వాకింగ్ కు వచ్చే వారి కోసం ఎంతో శ్రమకోర్చి ఈ జిమ్ ఐటమ్స్ ను ఏర్పాటు చేసిన దాతలను ఆయనే అభినందించారు. సైక్లింగ్ ను డాక్టర్ వీరన్న, వెయిట్ లిఫ్టింగ్ ఐటమ్ ను మున్సిపల్ అధికారి తండా సత్యనారాయణ, మినీ ప్యారాలాల్ బార్ను మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్ ప్రారంభించారు.