17 April, 2026 | 10:32 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు

28-06-2025 12:00 AM

ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ 

మహబూబాబాద్, జూన్ 27 (విజయ క్రాంతి): రాష్ట్రంలో నిలువ నీడలేని ప్రతి పేద కుటుంబానికి నిలువ నీడ కల్పించడానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని, దశలవారీగా అందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని, ఇప్పటివరకు ప్రొసీడింగ్స్ ఇచ్చిన లబ్ధిదారులు ఇండ్లు కట్టుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ , డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు.

డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని రాజోలు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వం సూచించిన విధంగా ఇల్లు నిర్మాణం చేపట్టాలని, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేయకూడదని ఆదేశించారు.

అలాగే కురవి మండలం కొత్తూరు ( సి) గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటుచేసిన సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల విద్యాభివృద్ధికి దాతల చేయూత అవసరమని, ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల ను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటుందని చెప్పారు.