calender_icon.png 20 May, 2025 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

హైదరాబాద్లో బీయూబో వాహనాలు

17-05-2025 12:00:00 AM

కార్ఖానాలో డీలర్షిప్ అవుట్‌లెట్ ప్రారంభం

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): గుజరాత్ కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెం దుతున్న ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ బీయూ గురువారం సికింద్రాబాద్‌లోని కార్ఖానాలో తన ప్రత్యేకమైన డీలర్షిప్ అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. తెలంగాణకు కొత్తగా నియమించబడిన అధికారిక పంపిణీదారు, హైదరాబాద్ ప్రత్యేక డీలర్ ఎంవీ ఆటోమొబైల్స్‌కు చెందిన మహేష్ చౌదరి, సాయివినీత్ భాగస్వామ్యంతో అవుట్‌లెట్ ను ప్రారంభించినట్టు బీయూ వ్యవస్థాపకులు ఉర్విష్ షా, బిండి షా తెలిపారు.

భారతదేశంలో స్థిరమైన చలనశీలత యొక్క భవి ష్యత్తును నడిపించడం అనే స్పష్టమైన లక్ష్యం తో బీయూ స్థాపించామన్నారు. నాణ్యతతోపాటు సరసమైన ధరలపై బీ యూధూ ద్విచక్ర వాహనాలను కస్టమర్లకు అందజేస్తున్నట్టు తెలిపారు.

పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ వాహనా లు సమర్థవంతమైన వినియోగించుకోవచ్చన్నారు. బీయూధా పెరుగుతు న్న డిమాండ్‌ను బట్టి భారతదేశం అంతటా 35 కంటే ఎక్కువగా డీలర్లు ముందుకొచ్చారని చెప్పారు. బీయూ ద్విచక్ర వాహనాలు ఆటో పరిశ్రమలో రెండు దశాబ్దాల కుపైగా అనుభవం ఉన్న నిపుణుల మేథాశక్తి తో రూపొందించినట్టు తెలిపారు.