calender_icon.png 20 May, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి

17-05-2025 12:00:00 AM

-డీఎస్పీ ఎన్ చంద్రబాబు

టేకులపల్లి, మే 16 (విజయక్రాంతి) : శాంతియుత వాతావరణంలో పండుగలను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని ఇల్లందు డిఎస్పి ఎన్ చంద్రభాను అన్నారు. జూన్ 7వ తేదీన జరగబోయే బక్రీద్ పండుగ సందర్భంగా శుక్రవారం టేకులపల్లి పోలీస్ స్టేషన్ లో మతపెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి  మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా పండగలను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని ఆయన తెలిపారు.

ప్రజలంతా పండుగలను మతసామరస్యంతో జరుపుకునే విధంగా ఆయా మతాల పెద్దలు ప్రజల్లో సమన్వయం ఏర్పడేలా చేయాలన్నారు. పండుగ ఏ మతానిది అయిన సామరస్యత చాలా మంచి సంబంధాలను పెంపొందిస్తుందన్నారు. వచ్చే నెల జరగబోయే బక్రీద్ పండుగ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో జరిగేలా మత పెద్దలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

శాంతిభద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని, ఎవరైనా గొడవలు సృష్టించేలా వ్యవహరిస్తే వెంటనే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో  సర్కిల్ ఇన్స్పెక్టర్ తాటిపాముల సురేష్ , టేకులపల్లి, బోడు ఎస్త్స్రలు ఎ.రాజేందర్, పి. శ్రీకాంత్, మత పెద్దలు, పలు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.