భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం రూ.2 కోట్ల 43 లక్షలు
23-06-2026 12:00 AM
అత్యంత భద్రత మధ్య లెక్కించిన దేవదాయ శాఖ అధికారులు
భద్రాచలం, జూన్ 22, (విజయక్రాంతి) : భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి హుండీల లెక్కింపు సోమవారం నాడు అత్యంత భద్రత మధ్య జరిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన లెక్కింపులో గత 68 రోజుల హుండీ ఆదాయం రెండు కోట్ల 43 లక్షల 64 వేల 450 రూపాయలు వచ్చింది.
అంతేకాకుండా 51 గ్రామ్ బంగారం ఒక కేజీ వెండి కూడా ఈ లెక్కింపు ద్వారా రామయ్య ఆదాయానికి సమ పోయింది. ఏప్రిల్ 15వ తేదీన హుండీ లెక్కించగా 68 రోజుల తర్వాత సోమవారం నాడు లెక్కించారు. వచ్చిన ఆదాయాన్ని దేవస్థానం అధికారులు రామయ్య అకౌంట్లో వేయడానికి దేవస్థానం ఈవో దామోదర్ రావు బ్యాంక్ అధికారులకు అందజేశారు.






