ట్రిపుల్ ఐటీలో మరో ట్రబుల్
ఫోన్ల వినియోగంపై ఆంక్షలు
లోపాలు బయటకు రాకుండా దిద్దుబాటు చర్య
మండిపడుతున్న విద్యార్థులు
భైంసా జూన్ 22 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని పేరు ఎన్నికైన బాసర ట్రిబుల్ ఐటీలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలు విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. బాస ర ట్రిపుల్ ఐటీ లో వారం రోజుల క్రితం ఓ విద్యార్థి మూడు అంతస్తుల భవనంపై నుండి కిందికి దూకగా అంతకుముందు మెస్సులో బొద్దింక రావడంపై సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో బాసర త్రిబుల్ ఐటీ యాజమాన్యం విద్యార్థులు వినియోగించి ఫోన్లపై ఆంక్షలు విధించింది.
ఈ యూనివర్సిటీలో సుమారు 9000 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉండగా ఇదివరకు లైబ్రరీ క్లాస్ రూమ్ ఇతర ప్రదేశాల్లో సెల్ ఫోన్ నిషేధం ఉండగా తాజాగా మేస్ క్యాంటీన్లో కూడా సెల్ ఫోన్లు తీసుకురావద్దని సర్కులర్ జారీ చేసింది. మిస్ లో ఏదైనా లోపాలు ఉంటే విద్యార్థులు వాటిని సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో బాసర త్రిబుల్ ఐటీ ప్రతిష్ట దెబ్బతింటుందన్న ఉద్దేశంతోనే అధికారులు ఈ సర్కులర్ జారీ చేసినట్టు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
అయితే బాస ర త్రిబుల్ ఐటీ లో చదువుకుంటున్న విద్యార్థుల్లో సెల్ఫోన్ వాడకం ఎక్కువ కావడంతో చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని అం దుకే ఆంక్షలు విధిస్తున్నామని యాజమాన్యం లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నట్టు విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్నారు. బాసర త్రిబు ల్ ఐటీ లో ఏ సంఘటన జరిగినా ఆ సంఘటన వివరాలు గోప్యంగా ఉంచేందుకు యాజమా న్యం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తుందన్న ఆరోపణలు నిలవస్తున్నాయి.
వారం రోజుల క్రితం ఓ విద్యార్థి మూడు అంతస్తుల భవనం నుంచి కిందికి దూకగా తీవ్రగాలుగా ఆ బాలిక వివరాలు దానికి సంబంధించిన ఏ అంశం కూడా బయటకు పోకుండా రెండు గంటలసేపు యాజమాన్యం జాగ్రత్త పడ్డట్టు విద్యార్థి సంఘా నేతఒకరు తెలిపారు. అధికారులు చేసిన తప్పులను ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు సోషల్ మీడియాలో లోపాలను ప్రచారం చేస్తే అటువం టి విద్యార్థులపై వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఉదయం పూట టిఫిన్ కు వెళ్లిన ఓ క్యాంటీన్లో ఆలు కర్రీ ఉప్మాలో బొద్దింక కనిపించడంతో కొందరు విద్యార్థులు దాన్ని వీడియో ఫోటో తీసి బయటకు పంపడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
దీనిపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అధికారులు ఇప్పటివరకు నోటీసులతోనే సరికొచ్చారు. గతంలో ఎన్నోసార్లు విద్యార్థుల భోజనం లోపాల కారణంగా అస్వస్థకు గురై ఆసుపత్రులు పాలయ్యారు. సంఘటన జరిగినప్పుడు అధికారులు స్పందించి ఇప్పుడు అటువంటి సంఘటనలు జరిగిన బయటకు పోకుండా విద్యార్థులు వాడే ఫోన్లపై నిషేధం విధించడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు లోపాలను సరిదిద్దుకొని విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన భోజనం అందించాలని ఎత్తివేయాలని సూచిస్తున్నారు.






