28 August, 2026 | 2:08 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

మత్తు వద్దు మంచి భవిష్యత్తు ముద్దు

23-06-2026 12:00 AM

మాదకద్రవ్యాలపై ప్రత్యేక అవగాహన 

కూకట్‌పల్లి, జూన్ 22 (విజయక్రాంతి): మత్తు వద్దు మంచి భవిష్యత్తు ముద్దు పేరుతో మాదకద్రవ్యాల నివారణకు సైబరాబాద్ పోలీసులు  కూకట్పల్లి పోలీసుల ఆధ్వ ర్యంలో సోమవారం స్థానిక పిఎన్‌ఎమ్ స్కూల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి డిసిపి రితిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మాదకద్రవ్యాలకు నో చెప్పి మంచి జీవితా న్ని ఎంచుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాలు మీ భవిష్యత్తును, జీవితాన్ని, శరీ రాన్ని నాశనం చేస్తాయని  తెలిపారు. పౌరు లు ముఖ్యంగా యువత ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని భవిష్యత్తు గురించి  మంచి కలలు కనాలని సూచించారు.

విద్యార్థినీ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉం టూ విద్యపై దృష్టి పెట్టాలని సూచించారు. మాదకద్రవ్యాల కార్యకలాపాలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 100 కు సమాచారము ఇవ్వాలని తెలిపారు. మత్తు రహిత సమాజం కోసం మత్తు వద్దు మంచి భవిష్యత్తు ముద్దు అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో  బాలా నగర్ ఏసీపి నరేష్‌రెడ్డి, కూకట్‌పల్లి ఇన్స్పెక్టర్ సుబ్బారావు, కూకట్పల్లి ఎస్‌ఐ లు, పోలీస్ సిబ్బంది, పిఎన్‌ఎం పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.