నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డుకు బైంసాకవి ఎంపిక
కుభీర్,(విజయక్రాంతి): తెలుగు అకాడమీ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డుకు బైంసాకు చెందిన కవి, పండితుడు, ఆధ్యాత్మికవేత్త జాధవ్ పుండలిక్ రావు పాటిల్ ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ఆంధ్ర సారస్వత పరిషత్తు హైదరాబాదు వారి ప్రాథమిక, ప్రవేశ, విశారద పూర్వభాగం ,విశారద ఉత్తరభాగం పరీక్షలు 20 సంవత్సరాలు నిర్వహించి తెలుగు భాషాభివృద్ధికి పాటుపడినందుకుగాను.
తెలుగు సాహిత్యంలో చిమ్నీలు, మధురవాణి నూతన ప్రక్రియలు సృష్టించినందుకుగాను , వివిధ ప్రక్రియలలో రచనలు చేసినందుకు గాను ఈ అవార్డుకు ఎన్నికైనట్లు తెలుగు అకాడమీ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకురాలు ఈశ్వరి భూషణ్ నుంచి నుంచి ఆహ్వానం అందుకున్నారు. ఎన్నికైన చేపి రావు పాటిల్ కు నిర్మల్ జిల్లా కవులు కడారి దశరథ్, కొండూరి పోతన్న, బసవరాజు, పోలీస్ భీమేష్, నేరెళ్ల హనుమంతు, కవయిత్రిలు దేవి ప్రియ, రావుల చంద్రకళ తదితరులు అభినందించారు.




